Gurugram Bus Fire: వీడియో ఇదిగో, గురుగ్రామ్ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, సజీవ దహనమైన ఇద్దరు ప్రయాణికులు
సెక్టార్-12 గురుగ్రామ్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, జైపూర్‌లను కలిపే ప్రధాన క్యారేజ్‌వేపై ఝర్సా ఫ్లైఓవర్ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
- Read in
- తెలుగు
సెక్టార్-12 గురుగ్రామ్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, జైపూర్‌లను కలిపే ప్రధాన క్యారేజ్‌వేపై ఝర్సా ఫ్లైఓవర్ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్, గుర్గావ్ పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్యారేజ్‌వేపై AR 01 K 7707 రిజిస్ట్రేషన్ నంబర్ గల స్లీపర్ బస్సులో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందడంతో సెక్టార్ -29 అగ్నిమాపక కేంద్రం నుండి మూడు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి" అని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుల్షన్ కల్రా IANS కి తెలిపారు.గాయపడిన ఏడుగురు గురుగ్రామ్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఐదుగురు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారందరికీ 30 నుండి 50 శాతం కాలిన గాయాలు ఉన్నాయి. విచారణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Here's Videos
#WATCH | Haryana | A bus caught fire on the Delhi-Jaipur expressway in Gurugram this evening. Details awaited.
(Video Source: Video confirmed by locals) pic.twitter.com/HFyxvhbUmZ
— ANI (@ANI) November 8, 2023
#WATCH | Haryana: Latest visuals from the Delhi-Jaipur expressway in Gurugram where two people died after a bus was gutted in the fire. https://t.co/MlZZFKJwTj pic.twitter.com/guNWS72CKz
— ANI (@ANI) November 8, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 09, 2023 12:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

