మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. తన కుటుంబసభ్యులు తనను పెళ్లికి బలవంతం చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ తనూ అనే యువతి అదేరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఆమె తన భాగస్వామి భికం "విక్కీ" మావాయిని వివాహం చేసుకోవాలనే తన కోరికను వీడియోలో వ్యక్తం చేసింది, అతనితో ఆమె ఆరు సంవత్సరాల నుండి సంబంధం కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసుల మధ్యవర్తిత్వంలో తండ్రి మహేష్ తన కూతురు తనూతో ఏకాంతంగా మాట్లాడాలని అభ్యర్థించాడు.

వీడియో ఇదిగో, నార్సింగి అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు, కత్తితో పొడిచి అనంతరం బండ రాళ్లతో మోది దారుణంగా..

పోలీసులు అందుకు అంగీకరించడంతో ఏకాంతంగా మాట్లాతుండగానే తండ్రి ఆమెను చాలా దగ్గరి నుండి కాల్చాడు. ఆమె బంధువు రాహుల్ సహాయంతో అనేక సార్లు కాల్చాడు. దీంతో తనూ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి మహేశ్‌ను అరెస్టు చేసి కాల్చిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధువు రాహుల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తనూ యొక్క సోషల్ మీడియా ఖాతాలను సమీక్షిస్తున్నారు.

Madhya Pradesh Father Kills Daughter in Front of Cops 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)