కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించేది లేదన్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం ఉదయం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని పిటిషనర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నేటి సాయంత్రం పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఇదిలావుంచితే, కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై విచారణ జరుగుతున్న సమయంలోనే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే నాడు ఈ పిటిషన్‌ను తీరస్కరించిన సుప్రీంకోర్టు.. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాను విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి ఉంటే అప్పుడు తమను ఆశ్రయించవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
Plea moved in Supreme Court challenging Karnataka HC order dismissing various pleas challenging the ban on Hijab in educational institutes pic.twitter.com/HJv9eHgnR5
— ANI (@ANI) March 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)