దేశంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 10,488 కొత్త కేసులు వెలుగు చూశాయి. 313 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,65,662కు పెరిగింది. మరోవైపు, రికవరీలు మాత్రం బాగా పెరుగుతున్నాయి. నిన్న 12,329 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గతేడాది మార్చి తర్వాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. ఇవి 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం 1,22,714 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.
#COVID19 | Active caseload stands at 1,22,714 - lowest in 532 days; account for less than 1% of total cases, currently at 0.36% - lowest since March 2020. Daily positivity rate (0.98%) less than 2% for last 48 days. Weekly Positivity Rate (0.94%) less than 2% for last 58 days pic.twitter.com/uvQIBkoMum
— ANI (@ANI) November 21, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)