దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,64,202 కేసులు నమోదయ్యాయి. ఇక, ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,753కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుని 12,72,073 కేసులు ఇంకా క్రియాశీలంగా ఉండగా, రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతానికి పెరిగింది. వారపు పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,09,345 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే 315 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4,85,350కు చేరుకుంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)