జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఓ టెర్రరిస్టుని భారత బలగాలు హతమార్చాయి. షోపియాన్‌లోని తుక్వాన్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్‌ సెర్చ్‌నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే అతడు ఏగ్రూప్‌నకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)