టూవీలర్‌ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు. టూవీలర్‌ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్‌ సోరెన్‌ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)