జార్ఖండ్‌లో  ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకూర్‌లోని అమ్రపరా ప్రాంతంలో బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో  ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పలువురికి గాయాలు అయ్యాయని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పాకూర్‌ పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, బస్సు మరియు ట్రక్కు రెండూ అతివేగంతో వెళ్లడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డజనుకు పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందగానే ఆ ప్రాంతంలో కలకలం రేగడంతో పాటు కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)