కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడు మంది దుర్మరణం పాలవగా.. 26 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా బైపాస్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. కొల్లాపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనిర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుంబీలోని ఆసుప్రతికి క్షతగాత్రులను తరలించారు. 26 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను హుబ్లీ కమిషనర్‌ పరామర్శించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)