ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను (Kashi Vishwanath Corridor) సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా బాబా కాల‌భైర‌వుడికి ప్ర‌ధాని మోదీ హార‌తి ఇచ్చారు.మొద‌ట కాల‌భైర‌వుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కాలభైర‌వుడికి పూజ‌, అర్చ‌న‌ చేశారు. దీనిలో భాగంగా కాల‌భైర‌వుడికి హార‌తి ఇచ్చారు. మోదీని (Prime Minister Narendra Modi) క‌లిసేందుకు భారీ సంఖ్య‌లో జ‌నం ఆ ఆల‌యానికి చేరుకున్నారు. ఆల‌యంలో ఉన్న భ‌క్తుల‌తో కాసేపు ప్ర‌ధాని మోదీ గ‌డిపారు. వారికి అభివాదం చేశారు. కాశీ విశ్వ‌నాథ్ కారిడార్‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ ప్రారంభిస్తున్న విష‌యం తెలిసిందే. దాదాపు 244 ఏళ్ల త‌ర్వాత కాశీ విశ్వ‌నాథ ఆల‌య పున‌ర్ నిర్మాణం జ‌రుగుతోంది.

ఈ మెగా ప్రాజెక్టు ద్వారా వారణాసిలో పర్యాటకం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న దశాశ్వమేధ ఘాట్‌ దగ్గరలో పునర్నిర్మించిన కాశీ విశ్వనాథుడి దేవాలయం, ద్వారాలను ఆయన ప్రారంభించనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)