కేరళ (Kerala)లోని త్రిసూర్ (Thrissur ) జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ (Irinjalakuda) సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం త్రిసూర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇరింజలకుడ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.
News
25 people injured in road accident after private bus rams into another in Kerala's Thrissur #Kerala https://t.co/elskQgAbn4
— Mathrubhumi English (@mathrubhumieng) May 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
