ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్‌ (కేరళ, కోజికోడ్‌)కు బయలుదేరింది. టేకాఫ్‌ అయి విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి.

దీంతో అప్రమత్తమైన పైలట్‌ వెంటనే విమానాన్ని తిరిగి అబుదాబి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారులు తెలిపారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)