కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఒడిశా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది. వారాంతంలో పూర్తి లాక్‌డౌన్ ఉంటుందని, ప్రతి శుక్రవావారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం ఈనెల 5న ప్రకటించిన రెండు వారాల లాక్‌డౌన్ ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున రాష్ట్ర ఆరోగ్య నిపుణులు, జిల్లా అధికారులతో సంప్రదించి లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)