క‌రోనావైరస్ క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్ ను మే 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శ‌నివారం వెల్ల‌డించింది. ప్ర‌స్తుత లాక్‌డౌన్ మే 24తో ముగియ‌నుండ‌గా క‌రోనా కేసుల నియంత్ర‌ణ‌కు మ‌రో వారం రోజుల పాటు పొడిగించింది. కొవిడ్-19 రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలతో పాటు మెరుగైన వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ వెల్ల‌డించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో భేటీ అనంత‌రం ఆయ‌న లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇక నిత్యావ‌సరాల‌ను త‌ర‌లించే వాహ‌నాల‌ను లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ అనుమ‌తిస్తారు. ఇక‌ వైద్య సంబంధ కార‌ణాల‌తో జిల్లాల మ‌ధ్య తిరిగే వాహ‌నాల‌కు ఈ-రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని అధికారులు తెలిపారు

Here's Lockdown in Tamil Nadu Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)