మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్‌ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను రక్షించి, ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు ఇండోర్‌ నుంచి ఖాండ్వా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)