మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి (Gas Cylinder Explosion) 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి (Houses Collapse). చెంబూర్‌లోని గోల్ఫ్‌ క్లబ్‌ ప్రాంతానికి సమీపంలో గల ఓల్డ్‌ బ్యారక్‌ (Old Barrack ) వద్ద బుధవారం ఉదయం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్యాస్‌ సిలిండ్‌ పేలడంతో పక్కపక్కనే ఉన్న ఐదు ఇళ్లు కూలిపోయినట్లు చెప్పారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 11 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)