లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆయన స్టాండింగ్ కమిటికీ రాసిన లైటర్ మీద మాండ్య ఎంపీ, సినీనటి సుమలత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరమని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, దీని గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ తీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు. తన సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. ఆయనపై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.
In utter shock & disbelief at the third-degree torture meted out in police custody to sitting Loksabha MP @RaghuRaju_MP , unless they take immediate remedial measures,this ll reflect very badly on the #APpolice & Govt.I stand with my colleague & condemn this act. pic.twitter.com/LUHKjSusez
— Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) June 4, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)