మణిపూర్ (Manipur)లో అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా తీవ్రవాదులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడి కోసం తీవ్రవాదులు తక్కువ తీవ్రత కలిగిన మందుపాతర ఉపయోగించారని సైనికాధికారి తెలిపారు. గత నెలలో మణిపుర్‌లోని మోరే ప్రాంతంలో ఓ పోలీసు అధికారిని తీవ్రవాదులు కాల్చి చంపారు.
ఈ ఘటనతో మోరే ప్రాంతంలో అదనంగా 200 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మోహరించారు. గతవారం మణిపుర్ పోలీసు కమాండోలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అస్సాం రైఫిల్స్.. సాహసోపేతంగా వారిని కాపాడింది. ఈ దాడిలో ముగ్గురు కమాండోలు గాయపడ్డారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో దాడి కావడం గమనార్హం.
Here's News
Manipur Blast: Suspected Militants Trigger IED Explosion Near Assam Rifles Patrol Vehicle in Tengnoupal, None Hurt#ManipurBlast #Blast #IED #IEDExplosion https://t.co/qTVDhi63cJ
— LatestLY (@latestly) November 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)