మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్‌లో ఆందోళనకారులు హేమంత్ పాటిల్‌ను అడ్డగించారు.దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు.

మరాఠా రిజర్వేషన్ల నిరసనలు, ఎన్‌సిపి ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని తగలబెట్టిన దుండగులు, వీడియో ఇదిగో..

ఇక మరాఠా రిజర్వేషన్లకు మద్దతుగా బీజేపీ నేత లక్ష్మణ్ పవార్ సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. లక్ష్మణ్ పవార్ బీడ్ జిల్లా జియోరాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు పవార్ లేఖ పంపారు. తన రాజీనామా లేఖ చిత్రాన్ని కూడా ట్విట్టర్‌లో పంచుకున్నారు.అయితే లక్ష్మణ్ పవార్ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు.

Here's News

మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)