బీహార్ లో ఫోన్ మాట్లాడుతూ వీధిలో నిల్చున్న మహిళను ఓ వ్యక్తి హఠాత్తుగా ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. అతడు అదే విధంగా మరికొందరు మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.

అతడి పేరు మహ్మద్ అక్రమ్. అతడిని బీహార్ లో సీరియల్ కిస్సర్ గా పిలుస్తున్నారు. అతడి ఉన్మాద చర్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విచారణలో మహ్మద్ అక్రమ్ ఓ ముఠాకు నాయకుడని తెలిసింది. మహిళలను వేధించడం, చోరీలు ఈ ముఠాకు నిత్యకృత్యాలు అని తెలుస్తోంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు... మహ్మద్ అక్రమ్ తో పాటు నలుగురు ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)