దేశంలో ఈశాన్యంలోని ఐదు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో పొటెత్తిన వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో కనీసం 37 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరి ఆచూకీ గల్లంతైంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. కొండ ప్రాంతాల్లో కొండ చరియలు, రాళ్లు విరిగి పడటంతో వేల మంది ఇండ్లకే పరిమితం అయ్యారు.
అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లో గరిష్టంగా 21 మంది మరణించగా, మరో ఆరుగురు అదృశ్యమయ్యారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల్లో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. ఒడిశాలో ఆరుగురు, జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బంగాళాఖాతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్‌ల్లో మీదుగా అల్ప పీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీన పడవచ్చునని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Monsoon fury claims 37 lives in northern hills, eastern states https://t.co/vxKwwiHLWj pic.twitter.com/PkJgjXLj6A
— The Times Of India (@timesofindia) August 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)