దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారానికి కరోనా కేసుల్లో ఏకంగా 46శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు. అలాగే ముంబైలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 8.4 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ముంబైలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,970గా ఉంది. ఇలా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నగరంలో కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఆదేశాలిచ్చారు.
1st June, 6:00pm
Positive Pts. (24 hrs) - 739
Discharged Pts. (24 hrs) - 295
Total Recovered Pts. - 10,44,005
Overall Recovery Rate - 98%
Total Active Pts. - 2970
Doubling Rate - 2027 Days
Growth Rate (25th May- 31st May)- 0.033%#NaToCorona
— माझी Mumbai, आपली BMC (@mybmc) June 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)