కర్ణాటకలో చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య మరువక ముందు మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల ముస్లిం మ‌త గురువు ఖ్వాజా స‌య్య‌ద్ చిస్తీని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌లో కాల్చి చంపారు. యేలా ప‌ట్ట‌ణంలో ఉన్న ఎంఐడీసీ ఓపెన్ ప్లాట్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఖ్వాజా స‌య్య‌ద్ చిస్తీని పాపుల‌ర్‌గా సూఫీ బాబాగా గుర్తించారు. దుండ‌గులు బాధితుడి నుదుటిపై పిస్తోల్ పెట్టి కాల్చారు. దాంతో అత‌ను అక్క‌డిక్క‌డే మృతిచెందిన‌ట్లు అధికారులు తెలిపారు. సూఫీ బాబాను చంపి అత‌నికి చెందిన ఎస్‌యూవీ వాహ‌నాన్ని ఆగంత‌కులు ఎత్తుకెళ్లారు. యేలా పోలీస్ స్టేష‌న్‌లో మ‌ర్డ‌ర్ కేసు నమోదు అయ్యింది. హంత‌కుల కోసం వేట కొన‌సాగుతోంది. ఆ హ‌త్య వెనుక ఉన్న కార‌ణాలు ఇంకా తెలియరాలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)