పోలీసులు రూ. 5 లక్షలు లంచం అడిగారని ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ యువకుడు విడుదల చేసిన సెల్పీ వీడియోపై న‌ర‌సరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. మదార్ వలీ పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అత‌ణ్ణి నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు న‌గ‌దు అడ‌గ‌లేదు. త‌ప్పు త‌న‌దేన‌ని, భ‌య‌ప‌డి అలా చెప్పాన‌ని మదార్ వలీ విచార‌ణ‌లో ఒప్పుకున్నాడు. అవాస్త‌వాల‌ను సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేసి.. పోలీసులపై దుష్ప్ర‌చారం చేయొద్దని తెలిపారు.

వీడియో ఇదిగో, తప్పుడు కేసులో ఇరికించి రూ. 5 లక్షలు లంచం డిమాండ్, రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానంటూ యువకుడు వీడియో

కాగా నరసరావుపేట రూరల్ సి.ఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ చేత తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని, కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచం గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని అంత డబ్బు తన వద్ద లేదని ఇక తనకి చావే శరణ్యం అని భావించి రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానని మదార్ వలి వీడియోలో తెలియజేశాడు.

Narasaraopet DSP Nageswara Rao reacted to the selfie video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)