భారత్- నేపాల్ దేశ సరిహద్దుల్లో చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ టీనేజర్ల మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వారిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ముగ్గురు మైనర్లు కరీనా గణేష్(16), కల్పనా గణేశ్(16), అంజలి గణేశ్(17).. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బసంత పాఠక్ తెలిపారు. ఈ మేరకు వారి పేరెంట్స్ మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, వీరు ముగ్గురు సుంకోషి టీ గార్డెన్‌లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు.
Three teenage girls have been found dead in mysterious circumstances in a tea estate in Jhapa.Karina Ganesh (16), Kalpana Ganesh (16) and Anjali Ganesh (17). They used to work for the tea estate there but were missing since Saturday morning.Police are taking the bodies in hospita pic.twitter.com/vL2Vxs3W5R
— Santosh Bam (@SantoshBam8) July 24, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)