ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫర్బనీ ఎమ్మెల్యే అంగదా కన్హర్ 58 ఏళ్ళ వయసులో పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఒడిశాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు తన చిన్ననాటి స్నేహితుడు, సర్పంచ్ అయిన సుదర్శన్ కన్హర్ (58)తో కలిసి అంగదా కన్హర్ పరీలు రాస్తున్నారు. శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్‌ను విజయవంతంగా రాశారు. కాగా, తాను 1978లో చదువు మానేశానని ఎమ్మెల్యే కన్హర్ చెప్పారు. కుటుంబ కారణాలతో పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఎమ్మెల్యే అయిన తాను పలు సందర్భాల్లో 50 ఏండ్లు పైబడినవారు కూడా పదో పరీక్షలు రాస్తున్నారని చెప్పానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను పరీక్షలు ఎందుకు రాయకూడదనే సందేహం కలిగిందని, అందుకే ఇప్పుడు నేను కూడా పరీక్షలు రాస్తున్నాని చెప్పారు. పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేశారు.
Odisha: BJD MLA Angada Kanhar Appears For Class 10 Exam 40 Years After Dropping Out of School#odisha #bjd #bijujantadal #phulbani #angadakanharhttps://t.co/WrUZxC5xzQ
— LatestLY (@latestly) April 30, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)