ఒడిశాలో సరికొత్త మోసం బయటపడింది. కటక్‌లోని ఛత్రబజార్ ఏరియాలో టమాటా వ్యాపారిని ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. తనతో వచ్చిన ఇద్దరు పిల్లలను షాపు దగ్గర కూచోబెట్టి నాలుగు కిలోల టమాటాలతో పరారయ్యాడు. ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి నాలుగు కిలోల టమాటాలు తీసుకున్నాడు. మరో పది కిలోలు కూడా కావాలని చెప్పాడు.
ఆపై బ్యాగు తీసుకొస్తానని, అప్పటి వరకు తన పిల్లలు ఇక్కడే ఉంటారని నాలుగు కిలోల టమాటాలతో వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపటికీ ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో వ్యాపారి అనుమానించాడు. పిల్లలను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అసలు తమకు తెలియదని ఆ పిల్లలు చెప్పారు. పని ఇప్పిస్తానని, చెరో రూ.300 ఇస్తానని చెప్పడంతో ఆయనతో కలిసి వచ్చామని వివరించారు. తమను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్లిపోయాడని చిన్నారులు బోరుమన్నారు.
Here's News
Man ‘mortgages’ 2 kids, flees with #tomatoes in #Cuttack #Odisha #Odishabytes #odishabytesnewshttps://t.co/YOTe0bTEVy
— Odisha Bytes News (@BytesOdisha) July 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)