ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో పాడుబడిన బోరుబావిలో కూరుకుపోయిన నవజాత బాలికను మంగళవారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన రెంగలి ప్రాంతంలోని లారిపాలి గ్రామంలో సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో చిన్నారిని సంబల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

పాప తరపు వారు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. ఇనుపతో చేసిన 20 అడుగుల లోతున్న బోరు బావిలోకి చిన్నారి ఎలా వచ్చిందో తెలియరాలేదు. పసికందును ఎవరో అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పసికందును రక్షించడం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమె దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)