దేశంలో క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఇవాళ ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా సమావేశం ( PM Review meeting ) నిర్వ‌హించ‌నున్నారు. ఈ సాయంత్రం 6.30 గంట‌ల‌కు స‌మావేశం (PM Narendra Modi To Chair COVID-19 Review Meeting) మొద‌ల‌వుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దేశంలో క‌రోనా ప‌రిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైర‌స్ క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ప‌రిస్థితులు త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.

ఇదిలావుంటే కేంద్రం ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్ క‌ర్ఫ్యూలు విధించాల‌ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఈ నెల 20న‌ మార్గద‌ర్శ‌కాలు జారీచేసింది. ఆయా ప్రాంతాల‌ను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్ర‌క‌టించాల‌ని సూచించింది. కాంటాక్ట్ ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్ విష‌యాల్లో క‌చ్చిత‌త్వంలో ఉండాల‌ని ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను ఆదేశించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)