యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్ నియమితులయ్యారు. ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమీషన్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రీతి సుదన్ యూపీఎస్సీలో సభ్యురాలిగా 2022లో ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ చైర్మెన్ మనోజ్ సోనీ ఆమె చేత ప్రమాణం చేయించారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బయోడేటా ఇదే..
1983 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సుదన్. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబూషన్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా, మహిళా, శిశు అభివృద్ధి, రక్షణ శాఖల్లో కార్యదర్శిగా చేశారు. ఆర్థికశాస్త్రంలో ఎంఫిల్ చేశారు. సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఎంఎస్సీ చదివారు. రెండు కీలకమైన కేంద్ర పథకాలను ఆమె రూపకల్పన చేశారు. బేటీ బచావో, బేటీ పడావోతో పాటు ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లకు తుదిరూపు ఇచ్చారు. నేషనల్ మెడికల్ కమీషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కమీషన్, ఈ-సిగరెట్ల నిషేధంపై చట్టాలను సుదన్ రూపొందించారు.
Here's News
1983 batch IAS officer and former Union Health Secretary Preeti Sudan will be the new UPSC Chairperson: Preeti Sudan confirms to ANI
(File photo) pic.twitter.com/FmyXZZ2U0m
— ANI (@ANI) July 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)