వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులో పూజా ఖేద్కర్ సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పుణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే సెలెక్షన్ సమయంలో యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి.పూజా ఖేద్కర్ మీద వచ్చిన ఆరోపణలపై ఇటీవలే కేంద్రం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసి, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించింది.
మహారాష్ట్రకు చెందిన వైభవ్ కోకట్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ తో పూజా ఖేద్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖరీదైన ఆడి కారుతో పూజా ఖేద్కర్ ఫొటోను వైభవ్ కోకట్ పోస్టు చేశారు. దాంతో అందరి దృష్టి ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పైకి మళ్లింది. ఆమె యూపీఎస్సీ సెలెక్షన్ కోసం చేసిన అక్రమాలు కూడా బయటకు వచ్చాయి.
Here's News
Union Public Service Commission (UPSC) cancels the provisional candidature of Puja Manorama Dilip Khedkar, a provisionally recommended candidate of the Civil Services Examination-2022 (CSE-2022) and permanently debars her from all future exams and selections: UPSC
— ANI (@ANI) July 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)