వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.
‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు.
Rachamallu Siva Prasad Reddy Sensational Comments On Sharmila
అహంకారం+అత్యాశ= షర్మిలమ్మ
రాజకీయంగా జగన్ ని అంతం చేయడమే షర్మిల లక్ష్యం.. - రాచమల్లు శివప్రసాద రెడ్డి@realyssharmila #RachamalluSivaprasadreddy #YSRCP #RTV pic.twitter.com/mjKv1GT4oW
— RTV (@RTVnewsnetwork) October 25, 2024
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని షర్మిలమ్మ బజార్లోకి ఈడ్చారు.
సత్యం ఏదో, అసత్యం ఏదో, స్వార్థం ఎవరిదో, శత్రువులతో చేతులు కలిపి జగన్ గారికి అన్యాయం చేసే కుట్ర గురించి చెప్పాలి.
షర్మిలమ్మ అనుబంధాల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
అనుబంధాలకు… pic.twitter.com/YI3gtYdSkK
— YSR Congress Party (@YSRCParty) October 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)