Truck Carrying Fireworks To Ayodhya Catches Fire: ఈ నెల 22న అయెధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు బాణసంచా తరలిస్తున్న లారీలో మంటలు చెలరేగాయి.ఈ మంటల తాకిడికి లారీలో ఉన్నపటాకులు పేలడంతో ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

కాగా తమిళనాడు నుంచి అయోధ్యకు భారీగా బాణసంచాను లారీలో రవాణా చేస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌ జిల్లాలోని ఖర్గి ఖేడా గ్రామానికి ఆ లారీ చేరుకోగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని బాణసంచా అంతా పేలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఇదిగో..

Here's Video

.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)