ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో లక్నో-కాన్పూర్ హైవేపై ఓ కూడలి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న మరో ముగ్గురిపైకి కూడా దూసుకెళ్లింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు కారును ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కారు ఓ గుంతలో పడిందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారని, మరో ఇద్దరు తల్లీకూతుళ్లు ఉ‍న్నారని పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆరుగురు చనిపోవడంతో స్థానికులు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని  రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రెండు గంటలపాటు రహదారిని దిగ్భందించారు. పోలీసులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)