స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, దీంట్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి కేవలం సుప్రీంకోర్టు ఒక్కటే రక్షణ కల్పించదని పేర్కొంది. పార్లమెంటు వంటి పలు వ్యవస్థలు కూడా రాజ్యాంగ పరిరక్షణలో పాలుపంచుకుంటున్నాయని వివరించింది. అలాగే దేశంలో పురుషులకు, మహిళలకు కనీస వివాహ వయసు ఒకే విధంగా ఉండాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.

కనీస వివాహ వయసుపై ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పురుషుల వివాహ వయసు 21 అయినప్పుడు, మహిళల వివాహ వయసును కూడా 21 సంవత్సరాలు అని ప్రకటించాలని, ఆ మేరకు చట్ట సవరణ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలా బెంచ్ విచారణ చేపట్టింది. కనీస వివాహ వయసు చట్ట సవరణ చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, దానిపై తాము పార్లమెంటుకు ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్ట సవరణ చేస్తే మహిళలకంటూ ఓ వివాహ వయసు లేకుండా పోతుందని అత్యున్న ధర్మాసనం అభిప్రాయపడింది.

Here's Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)