తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు సమీపంలోని హైవే ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. చిదంబరం వెళ్తున్న బస్సు చెన్నై – తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై మధురాంతకం వద్ద ట్రక్కును ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షల సహాయాన్ని ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)