భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరంలోని టీపీ చత్రం ప్రాంతంలో ఓ అభాగ్యుడు అపస్మారక స్థితిలో ఉండగా, రాజేశ్వరి అనే లేడీ ఎస్సై అతనిని స్వయంగా తన భుజాలపై వేసుకుని వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆమె సేవను గుర్తించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిని అభినందించారు.

ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి అద్భుతంగా పనిచేశారు. ప్రాణాల కోసం పోరాడుతున్న అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని ఆమె స్వయంగా పైకి లేపి ఆసుపత్రికి పంపింది. చికిత్స కొనసాగుతోంది, అతను బాగానే ఉన్నాడు. ఆమె అద్భుతమైన అధికారిణి. ఈ క్రెడిట్ అంతా ఆమెకే చెందుతుందని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ఆమెను అభినందించారు.

వైరల్ అవుతున్న వీడియో గురించి ఆమె మాట్లాడుతూ.. నేను ముందుగా ప్రథమ చికిత్స అందించాను, తర్వాత నేను అతనిని భుజాల మీద ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాను.ఈ లోపే ఒక ఆటో వచ్చింది, మేము అతన్ని ఆసుపత్రికి పంపాము. అనంతరం నేను ఆసుపత్రిని సందర్శించాను. అక్కడ అతని తల్లి అక్కడ ఉంది. ఆందోళన చెందవద్దని, పోలీసు శాఖ వారికి అండగా ఉంటుందని నేను వారికి హామీ ఇచ్చాను. అతనికి చికిత్స కొనసాగుతోందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్ చెప్పారని తెలిపారు.

Here's ANI Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)