క‌రోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌ను సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు (Tamil Nadu Govt Extends Lockdown) త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శ‌నివారం వెల్ల‌డించింది. అయితే లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు భారీ స‌డ‌లింపుల‌ను (Additional Relaxations) ప్ర‌క‌టించింది. ఆగ‌స్ట్ 23 నుంచి థియేట‌ర్ల‌ను 50 శాతం సీటింగ్ సామ‌ర్ధ్యంతో తెరిచేందుకు అనుమ‌తించింది. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం బీచ్‌ల‌ను ఓపెన్ చేయ‌నున్నారు. అన్ని షాపులు, వాణిజ్య సంస్ధ‌ల‌ను రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ ప‌నిచేసేందుకు అనుమ‌తించారు. ఐటీ కార్యాల‌యాలు నూరు శాతం సిబ్బందితో ప‌నిచేసే వెసులుబాటు క‌ల్పించారు. ఏపీ, క‌ర్నాట‌క‌కు అంత‌రాష్ట్ర బ‌స్సుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. బార్లు, రిసార్టులు, లాడ్జిలు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక త‌మిళ‌నాడులో తాజాగా 1668 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)