తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి మొదటివారంలోనే ఎండలు దంచికొడుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది(Telangana Half Day Schools).
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహిస్తారు. అలాగే ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి( Half Day Schools).
ఇక పదో తరగతి పరీక్షా జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు. ఇప్పటికే రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)