ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ బాబు కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం ఈ తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్ 9న జరుగుతాయని ప్రకటించారు. అస్వస్థతకు గురైన ఢిల్లీ బాబు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సమాచారం. ఆయన ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పవచ్చు.యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై తమిళంలో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్‌తో పాటు డబ్ కూడా అయ్యాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి, రాక్షసన్ (రాక్షసుడు) వంటి చిత్రాలు తెలుగువారిని బాగా మెప్పించాయి. టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Here's news
With a heavy heart, we announce the untimely passing of Mr. G.Dilli Babu sir, the esteemed producer and visionary founder of Axess Film Factory. pic.twitter.com/DBcStBbLZy
— Axess film factory (@AxessFilm) September 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)