తిరుపతి వారాహి డిక్లరేషన్‌ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. తాజాగా శుక్రవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ‘వేచి చూడండి. వేచి చూడండి’ అని అన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’’ అని పవన్ కల్యాణ్‌ అన్నారు. అయితే పవన్‌ వ్యాఖ్యలపై డీఎంకే ఇప్పటికే గట్టి కౌంటర్‌ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘‘ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’’ అని సూచించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)