మండే ఎండల్లో వడగండ్ల వాన యూపీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. త్తరప్రదేశ్‌ రాష్ట్రం జాలౌన్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో పాటుగా వడగండ్ల వాన షురువైంది. పెద్ద ఎత్తున వడగండ్లు పడ్డాయి. దాదాపు అరగంటపాటు కురిసిన ఈ వాన ధాటికి పంట చేలు దెబ్బతిన్నాయి. జోన్న, మొక్కజొన్న, గోధుమ, వరి పంటలతోపాటు కూరగాయల పంటలు ఈ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయాయి. ఒక్కసారిగా కురిసిన ఈ వడగండ్ల వాన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు. రాబోయే విపత్తును ముందే గమనించి భయం నిండిన అరుపులు, కేకలతో పక్షులు, పశువులు, కుక్కలు సంకేతాలివ్వడం కొసమెరుపు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)