ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలవగా.. మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం మౌదాహ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతులు ఇమిలియా, ఇంగోటా వాసులుగా తెలుస్తున్నది.

Uttar Pradesh Road Accident: 10 Killed, 7 Injured After Vehicle Carrying Pilgrims From Haridwar Falls Into Roadside Ditch in Gajraula #UttarPradesh #Gajraula #Accident #Haridwar https://t.co/mrFu83TMPk

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)