ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీ ఓ ద‌ళితుడిపై దాడి చేసి అత‌ని చేత కాళ్లు నాకించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన 2.30 నిమిషాల వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. నేల‌పై కూర్చుని చేతుల‌తో చెవ్వులు ప‌ట్టుకుని మోటార్‌సైకిల్‌పై ఉన్న వ్య‌క్తి పాదాల‌ను ఆ ద‌ళిత‌ వ్య‌క్తి నాకాడు. అయితే ఆ బాధిత ద‌ళిత‌ వ్య‌క్తి మారిజునా అమ్ముతున్న‌ట్లు మ‌రో వీడియోలో ఆరోపించారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను భ‌యంతో ఆ ద‌ళితుడు అంగీక‌రిస్తున్న‌ట్లు వీడియోలో ఉంది. వీడియో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు ఏడు మందిని అరెస్టు చేశారు.

ఏప్రిల్ 10వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బాధితుడు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు త‌ర్వాత అరెస్టులు జ‌రిగాయి. ద‌ళిత బాధితుడు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. త‌ల్లితో క‌లిసి ఉంటున్నాడు. అయితే నిందితుల్లోని ఒక‌రి పొలాల్లో ఆ బాధితుడి త‌ల్లి ప‌నిచేస్తోంద‌ని స్థానికుల ద్వారా తెలిసింది. త‌ల్లి ప‌నికి సంబంధించిన డ‌బ్బులు ఇవ్వాలని ఆ విద్యార్థి డిమాండ్ చేయ‌డంతో అత‌నిపై అటాక్ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ద‌ళితుడిని ప‌ట్టుకుని కాళ్లు నాకించిన‌ట్లు అనుమానిస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్‌లో ఈ ఆరోప‌ణ‌లు లేన‌ట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)