హెజ్‌బొల్లా (Hezbollah) ఇజ్రాయెల్‌ మధ్య క్షిపణులు, డ్రోన్‌ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడిలో లెబనాన్‌ రాజధాని బీరుట్‌ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. క్షణాల్లో ధూళిగా మారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ క్షిపణి దాడికి 40 నిమిషాల ముందు ఇజ్రాయెల్ హెచ్చరిక చేసింది. బీరుట్‌ దక్షిణాన ఉన్న రెండు నివాస భవనాలు, దాని చుట్టుపక్కల ఇళ్లలో ఉండే పౌరులు ఖాళీ చేయాలని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

వీడియో ఇదిగో, టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి, ముగ్గురు మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు

గతవారం హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నివాసంపై డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో ఒకటి ఉత్తర ఇజ్రాయెల్‌లోని సెసెరియా నగరంలో ప్రధాని నివాసం ఉన్న భవనాన్ని తాకింది. ఆ సమయంలో ఇంటిలో నెతన్యాహు, ఆయన భార్య లేరని ఇజ్రాయెల్‌ అధికార వర్గాలు తెలిపాయి.

Israeli missile attack Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)