ఈ రోజు తెల్లవారు ఝామున పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన హౌరా జిల్లాలోని బగ్నాన్‌ వద్ద సోమవారం తెల్లవారు జరిగింది. ప్రమాద ఘటనలో 40 మంది గాయపడ్డారని, అయితే ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. దిఘాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 మంది వరకు ప్రయాణికులున్నారు. అయితే, బస్సు బోల్తాపడడానికి గల కారణాలు తెలియరాలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)