భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో తమవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటివరకు పలువురు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు విరాళాన్ని అందజేశారు. తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్.
తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఏపీ, తెలంగాణ సహాయనిధులకు రూ.10 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడానికి అంతా ముందుకు రావాలని కోరారు. వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన
Here's Tweet:
భారీ విరాళం ప్రకటించిన రెబల్ స్టార్ ప్రభాస్..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్..
వరదలకు గురైన ప్రాంతల్లో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు చేసిన ప్రభాస్..#TelanganaFloods #andhrafloods #Prabhas @PrabhasRaju @TrendsPrabhas pic.twitter.com/lngt7ciZJg
— Telangana Awaaz (@telanganaawaaz) September 4, 2024
తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.
ఏపీ, తెలంగాణ సహాయనిధులకు రూ.10 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన రమణ.#APRains #TelanganaRains #NVRamana #NewsUpdates #Bigtv @JaiTDP @ncbn @INCTelangana @revanth_anumula pic.twitter.com/PMDycuVaMG
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)