అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువరికి గాయలవ్వగా.. వాహనాలు ధ్వసం అయ్యాయి. పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయాన్ని పన్నీర్‌ సెల్వం( ఓపీఎస్‌) వర్గం స్వాధీనం చేసుకుంది. తన వర్గం నేతలతో ఓపీఎస్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో అన్నాడీఎంకే ఆఫీస్‌ దగ్గర 144 సెక్షన్‌ విధించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)