కాంగ్రెస్‌ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ.. భారత్‌ న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర ద్వారా మరోసారి జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్‌ న్యాయయాత్ర పేరుతో రాహుల్‌ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

రెండవ సారి ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్‌ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాలు.. 85 జిల్లాల గుండా ఉంటుంది. మణిపూర్‌లో మొదలై.. ముంబై దాకా దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది.ఈసారి యాత్రకు భారత్‌ జోడో యాత్ర అని కాకుండా.. భారత్‌ న్యాయయాత్ర అని పేరు పెట్టారు. ఈ సారి రాహుల్ పాదయాత్ర బస్సు ద్వారా, కాలి నడక ద్వారా కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్‌ స్పష్టత ఇచ్చారు.ఈ యాత్రలో యువత, మహిళలు, అణగారిన వర్గాలతో రాహుల్‌ ముఖాముఖి అవుతారని వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)