జార్ఖండ్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న (సోమవారం) బలపరీక్ష (Jharkhand Floor Test)జరగనున్నది.కొత్త ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉండటంతో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్‌కి తిరుగు ప్రయాణం అయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో ఈడీ అరెస్ట్‌కు ముందు హేమంత్ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

81 మంది సభ్యులున్న జార్ఖండ్‌ అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది. ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌)కు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో అధికార జేఎంఎం కూటమికి మొత్తంగా 46 మంది సభ్యులున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీకి 25 మందితోపాటు దాని మిత్ర పక్షాలతో కలిపి 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.తాజాగా బల పరీక్ష నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. జేఎంఎం ప్రభుత్వం గతంలో కూడా అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంది. 48 ఓట్ల మెజారిటీతో ఫ్లోర్‌ టెస్ట్‌లో విజయం సాధించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)